Loading...
.

మన గోదావరి కథ

మన గోదావరి కథ
సవతి పోరు సాక్షాత్తు అమ్మల కన్నయమ్మ మన పార్వతమ్మ కే తప్పలేదు అట, భగీరధ ప్రయత్నం తొ పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఒకసారి మునులు అందరూ శివ పార్వతుల దర్శనార్దమై కైలాసానికి వెళ్ళారు కైలాసం లో శివుని దర్శనం మాత్రమే అయింది పార్వతీ దేవి దర్శనార్దం ప్రార్దన చేసిన మునులకు ఎంతకీ దర్శనబాగ్యం
కలగక ఎదురు చూసి చూసి వెను తిరుగు సమయంలో నారద మహర్షి వచ్చారు. అంత నారద మునుల వారిని విచారించగా పార్వతీ దేవి అలక పాన్పుపై ఉన్నారన్న విషయం తెలుసుకున్న మునులు
ఆశ్చర్యచకితులైరి . అంత అంధరూ కలసి గణపతిని దర్శనం చేసుకుని జరిగిన విషయాలను తెలిపి బాధ పడిరి అంత నారద మహర్షి వచ్చి బోలాశంకరుడైన శివునుని మెప్పించిన నాడు
ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనిరి దానికి తగిన సమర్దుడైన మహర్షి కోసం ఆలోచించగా అన్వేషించగా గౌతమ మహర్షి
సమర్దుడు అని అందరూ నిర్దారనకు వచ్చిరి కానీ ఆయన గొప్ప శివ భక్తుడు.........?

గౌతముడు గొప్ప శివ భక్తుడు మరియూ బ్రహ్మర్షి .బ్రహ్మదేవుని వరంవల్ల ఆయన కాలు మోపిన ప్రతిచోట కరువుకాటకాలు,ప్రకృతి విలయతాండవాలు ఉండవు సమృద్ధిగా పంట పండేది.
ఒకప్పుడు పెద్ద కరువు వచ్చింది మునులకు ఆహారం దొరకక చాలా ఇబ్బంది పడిరి అంత వారంతా నారద మహర్షి సలహా ప్రకారం గౌతముని ఆశ్రమానికి వచ్చారు.
గౌతముడు తన మహిమవలన వారందరికి మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి పరుస్తూ వచ్చారు అయితే, గౌతముని సన్య సమృద్దిని సంపదను చూచి మనులలో కొందరికి కన్ను కుట్టింది.
వారు ఒక మాయా గోవును సృష్టించారు దానిని గౌతమ మహర్షి యొక్క పొలంలో వదిలిరి.
ఆ ఆవు గౌతముని పొలాల మీద పడి పైరుని తినసాగింది గౌతముడది చూచి "అయ్యో ! పండిన పంట ఆవు తినపోతున్నదే" అని విచారపడ్డాడు.
అయితే గోవును కొట్టడం మహాపాతకం. అందువల్ల ఆయన దర్పపోచలతో ఆవును అదలించి అవతలకి తోలడానికి ప్రయత్నించారు. అయితే, గౌతముడు అలా వెళ్ళి గోవును అదిలించినప్పుడు దర్బపోచలు తాకీ తాకక ముందే ఆ మాయా గోవు చచ్చిపడింది.
అంత అది చూసిన మునులు అందరూ గౌతముని దూషించిరి " చీ! చీ! నీవు గోహత్యకు ఒడిగట్టిన మహాపాతకుడవు" అనిరి
ఇంక నీ యింట మేము భోజనం చెయ్యం అని చెప్పివెళ్ళిరి
తనకు గోహత్య పాతకం చుట్టుకున్నదని పాపం గౌతముడు చాలా బాధపడ్డాడు ఈ పాతకం ఎలా పోతుందో అని తనలో తాను చాలా మదనపడ్డాడు. ఇదంతా గమనిస్తున్న నారదుడు ఆ సమయమున గణపతిని ప్రార్దించి ఆయనచేత ఒక నాటకం ఆడించిరి అంత గణపతి ఒక కపట సన్యాసి వేషంలో అక్కడికి వచ్చి గోవు మరణించిన చోట "గంగ" ప్రవహిస్తే ఈ పాతకం పోతుందని గౌతముడికి చెప్పారు.
అంత గౌతముడు "గంగ"ను రప్పించుటకై బహుకాలం "శివుని"గురించి ఘోరమైన తపస్సు చేశాడు. .
తన తపస్సు చేత శంకరుని మెప్పించి గంగ అక్కడ ప్రవహించేటట్లు చేశాడు. ఆ పవిత్రమైన గంగాజల తాకిడికి గోవుబ్రతికింది. తరువాత ఆ గోవు ఒక స్త్రీ రూపం దాల్చింది.
ఆ స్త్రీ పార్వతీదేవి చెలికత్తె అని, శివుని నెత్తిమీద గంగను దింపివేయాలన్న ఉద్దేశ్యంతో మునులతో కలసి నారదుడు లోక కళ్యానార్దం ఆడిన నాటకంలో తాను పాల్గొని మాయా గోవుగా అక్కడికి వచ్చాను అని చెప్పి అదృశ్యమయింది. అంత గౌతముడు తన దివ్య దృష్టితో తెలుసుకొని సంతోషించిరి..
ఏమైతేనేం? గౌతమ మహర్షి తన ఆశ్రమ సమీపంలో గంగ ను ప్రవహింప చేయటం వల్ల ఆ నదికి గౌతమీనది అని, గోవును బ్రతికించడం వల్ల గోదావరి అని మరొక పేరు వచ్చింది....

1 comments:

narayana said...

godavari nadi gurincci baga teliyajesaru kani dani janma stanam vati vivaralu luda teliyajeste bagunttundi Ani ma Abhiprayam. @ bv

Post a Comment

కూడలి