Loading...
.

ఓం శనీశ్వరాయ నమః

ఓం శనీశ్వరాయ నమః
మన్న శనివారం శనిత్రయోదశి అట ఆ రోజు ఉదయమే అమ్మ phone చేసి అరె నాన్నా! ఈ రోజు శనిత్రయోదశిరా నువ్వు తొందరగా నిద్ర లేచి స్నానం చేసి
శివాలయానికి వెళ్లి అభిషేకం జరిపించ్చురా! అంది.
అసలు ఈ శనైశ్చరుడు ఎవరు అసలేంటీ కధ అని ఆలోచిస్తున్నారా..? అయితే మొదటగా ఈ స్వామి గురించి అమ్మ చెప్పిన చిన్న కధచెపుతాను ఆ తర్వాత నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను
"ఒక సారి కైలాసం లొ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కొలువు తీరి ఉన్నసమయంలొ అక్కడికి ఆదికూర్ముడు (కూర్మావతారాంశతొ సూర్యునికి జన్మించాడు కాబట్టి ఆది కూర్ముడు అని, మందగమనుడు కాబట్టి మందేశ్వరుడని, శనై శనై అనగా మెల్లగా చరించువాడు కనుక శనైశ్చరుడు అని పేర్లు వచ్చాయి అట)
వచ్చాడట
అప్పుడు ఈశ్వరుడు శని ని గురించ్చి " నీ గురించ్చి ప్రజలు అందరు ఎంతగనో ఆందోళన చెందుతున్నారు అసలు నీ మాటంటేనే భయపడటం జరుగుతోంది" ఎదీ నీ ప్రబావం నా మీద చూపు అన్నారు అంత శనైశ్చరుడు పరమేశ్వరా రేపు వచ్చే శనిత్రయోదశి నాడు చూపగలను అని విన్నపించ్చెను
అంత ఈశ్వరుడు ఆ విషయం గురించ్చి ఆలోచించ్చి శని ఉషస్సులో పాతాళం చేరి జమ్మిచెట్టు తొర్రలో ఆ దినమంతా ఏకాంతంగా గడిపెను మరు దినం కొలువులో పరమేశ్వరున్ని చూసినంత నారధ మహర్షి మందహాసముతొ పక్కకు తిరిగెను అంత అది గమనించ్చెన శివుడు నారదున్ని ఏమని అడగగా
"మహాదేవా! కైలాసంలొ పార్వతీ సమేతుడవై కొలువుతీరే తమరు పాతాళంలో జమ్మిచెట్టు తొర్రలో ఏకాంతంగా ఉండి వచ్చారు కదా స్వామీ!
ఇంక ఇది శని ప్రబావం కాగా మరి ఏమందురు అని ప్రశ్నించెను
అందుకు సంతోషించిన ఈశ్వరుడు శని ని ఉధ్దేశించి " నేటి నుంచి నీవు కూడ ఈశ్వర శబ్దంతో శనైశ్వరుడిగా పిలవపడతావు అని ఆశీర్వదించెను"
అంత శనీశ్వరుడు "పరమేశ్వరున్ని పూజించిన వారికి నా ప్రబావం ఉండదు అని చెప్పెను
సూర్యభగవానునికి ఛాయాదేవి యందు జన్మించినవాడు శని, సంజ్ణ వలన పుట్టినవాడు యముడు వరుసకు వీరిరువురూ సోదరులు.
నవగ్రహాలలో శని ఒకడు,జ్యోతిష్యశాస్త్రంలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్దాయానికి కారకుడు, మరియూ జాతకచక్రంలో శుభుడై,శుభస్తానాలలో ఉన్నప్పుడు గొప్పయోగం ఇస్తాడు.
అలాగే శని పీడను ఎవ్వరూ తప్పించుకోలేరు, ఈ గ్రహం లగ్నానికి లేదా జన్మరాశికి 12వన కాని,ద్యితీయ స్తానంలో గాని సంచరించే కాలాన్ని ఏలనాటి శని అంటారు.
మొత్తం 3 స్థానాలలో రెండున్నర సంవత్సరాల చొప్పున మొత్తం ఏడున్నర సంవత్సరాలు మనల్ని పాలిస్తాడు.
"నీలాంజన సమాభాసం రవిపుత్రం యమా గ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం"!!
ఇటువంటి స్ధితి వచ్చినప్పుడు కొందరికి అంతులేని కష్టాలు,అవమానాలు పెడతాడు. శనిపీడ పరిహారార్ధం ప్రతి శనివారం ఉపవాసాలు,వ్రతాలు,శనిగ్రహహానికి తైలాభిషేకాలు,నువ్వుల దానం మొదలైనవి చేస్తూ ఉండాలి.


0 comments:

Post a Comment

కూడలి