చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీనగరం ధగ్గర్లో "సిహి" అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక బాలుడు ఉన్నాడు.అతడు పుట్టుగుడ్డి.అతడి అసలు పేరు ఏమిటో
గాని అందరూ "గుడ్డివాడు"అనే అనేవారు. అతడిని అందరూ నిరాదరంగా చూసేవారు.
ఒకరోజు అతడి తండ్రి ఇంటి బయట అతడి సోదరులకు చదువు చెబుతున్నాడు. ఆ శ్లోకాలు వినసొంపుగా ఉన్నాయి. ఆ గుడ్డిపిల్లవాడిలో చదువుపై మమత ఏర్పడింది.
మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్లి "నాన్నా! నేనూ చదువుకుంటా?"అని అనునయంగా అడిగాడు. తండ్రి ఈసడించి "పోరా! పాడు పిల్లవాడా నీవు ఎందుకూ పనికిరావు" అని అన్నాడు
ఆ చిన్న హృదయం ఎంతో గాయపడింది. దగ్గరే ఉన్న సోదరులు "నీవు విద్య నేర్చుకోవాలనుకుంటున్నావా?వంటచేయటం ఎందుకు నేర్చుకోకూడదు?" అని గేలి చేశారు అప్పటికే గాయపడిన
అతడి హృదయాన్ని ఇంకా కెలికినట్లయింది.
ఎందుకూ పనికిరాని తాను ఆ చోటు విడిచిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలాగే చేశాడు అనుకున్నట్లుగానే ఊరూర తిరిగే వీధి గాయకుల ప్రాపకం దొరికింది. వాళ్ల వెంట చాలా చోట్లు తిరిగాడు.
పాటలు పాడటం నేర్చుకున్నాడు.
స్వయంప్రతిభతో పాటలు కట్టటం కూడా నేర్చుకున్నాడు.దానితో శ్రీకృష్ణుని లీలలను రసవత్తరంగా ఇమిడ్చాడు. మధురంగా పాడి రాజుల్నీ,పేదల్నీ ఆకట్టుకున్నాడు.
అతడి పాటలు పాటక జనుల హృదయాలలో పీఠాలు వేసుకున్నాయి. ఆ పాటలన్నీ "వ్రజ" భాషలో ఉన్నాయి.
ఆ విధంగా అతడు పాడిన వేలకొద్దీ పాటలు ఆ భాషను సుసంపన్నం చేశాయి.లెక్కకు మించిన పాటలు ఈనాటికీ అందరినీ అలరిస్తున్నాయి.
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
-
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP
సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాల...
10 years ago


0 comments:
Post a Comment