Loading...
.

నక్క యుద్ధబేరి కధ

అనగనగా ఒక ఊరు ఆ ఊరికి ఆనుకొని కాకులు దూరని కారడివి ఆ అడవిలో ఒక నక్క ఉండేది దానికి చాలా రోజులు ఆహారం దొరకలేదు.అది ఆకలితో అల్లాడుతూ తిండికోసం అక్కడా ఇక్కడా తిరిగింది.
తిరిగింది తిరిగింది తిరిగి ఒక యుద్ధభూమికి చేరింది అక్కడ దానికి చాలా ఆహారం దొరికింది అయితే ఆ యుద్ధభూమికి ఒక మూల ఒక చెట్టు కింద ఒక యుద్ధభేరి పడివుంది.
చెట్టుకొమ్మలు గాలికి ఊగి ఆ భేరికి తగిలినప్పుడల్లా అది గట్టిగా శబ్దం చేస్తోంది. ఆ ధ్వనికి నక్క బెదిరిపోయి ఏమీ తినకుండా చాలాసేపు ఒక ప్రక్కన నక్కి కూర్చుంది అంతలో దానికి ఒక ఆలోచన కలిగింది
"నేను శబ్దాన్ని విన్నందుకే ఎందుకు భయపడాలి? "సుఖదు:ఖాలతొ కాస్త ఆలోచించి,తెలివితో మెలిగినప్పుడే మనం సుఖపడగలం.అటువంటివాడే బుద్ధిమంతుడు" అనుకొని ఆ నక్క ధైర్యంగా వెళ్ళి ఆ భేరిని చూసింది
ఆ శబ్దాల వెనకనున్న రహస్యం దానికి తెలిసిపోయింది. ఆ భేరి నిండా కొవ్వు కూరి పెట్టారనుకొని ఆశతో దాన్ని కొరికి చూసింది.దానిలో ఏమీ లేదని,ఉన్నవి చర్మం,చెక్క మాత్రమేనని గ్రహించి ఆశ్చర్యపోయింది ఆ నక్క.
నీతి:- దేని గురించైన విన్నంత మాత్రంతొనే బెదిరిపోకూడదు పరిస్తితిని పరిశీలించకుండా ముందుగానే ఏదేదొ ఊహించుకొని భయపడడం తప్పు.

1 comments:

Audisesha Reddy said...

మీ బ్లాగు చూశాను. చక్కటి కథలతో ఆకట్టుకుంది. అందుకే ఫాలో అయ్యాను.
--ఆది శేషా రెడ్డి

Post a Comment

కూడలి