Loading...
.

అమ్మ కోసం

అమ్మ..!
అమ్మ..! తొమ్మిది నెలలు మోసి మనల్ని కంటుంది, ఆ తొమ్మిది నెలలు నిండే వరకూ గర్భంలో వుండే మనల్ని మోస్తూనే వుంటుంది. నెత్తిన ఉన్న బరువా ఎమన్నా ? కావాలంటే దించుకోవటానికి కానీ ఇది అలా కాదే 24గంటలూ మోయవలసిందే ఆ తరువాత ప్రసవవేదన ఎంత నొప్పి ఎంత వేదన ఆ మహాతల్లిది మన కోసం మన జన్మ కోసం ఆ తల్లి పడని పాట్లు లేవు చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా వేసి అండగా మనకు జన్మనిస్తుంది. అమ్మకు అది పునర్జన్మే. ఈ తొమ్మిది నెలలూ ఆమె ఎన్నో నియమాలు, మరెన్నో పత్యాలు (అన్నీ మనకోసమె) ఆ తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి మనకందిస్తుంది. మనం మంచిగా పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఆమె పడని పాట్లు లేవు తన నిద్రను మర్చిపోతుంది, మన ముడ్డి కడుగుతుంది,వేయిదేవుళ్ళకు మ్రొక్కుతుంది ఆ పిచ్చితల్లి. మన కోసం మన మీద ఉన్న అవ్యాజమయిన ప్రేమ కోసం. మనం “ఊ”.. కొడితే ఉగ్గుగిన్నెలు,అడుగు లేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు, పలకటం వస్తే పంచదార చిలుకలు పంచి పెట్టి పండుగ చేస్తుంది , మొదటి గురువుగా మాటలు నేర్పుతుంది , పాటలు పాడి నిద్రబుచ్చుతుంది. అన్నింటికీ మించి నీ తండ్రి ఫలానా అని మనకు చూపుతుంది . మనం పుట్టిన క్షణం నుండి తల్లి ఎవరో ఆమె స్పర్శ ఏమిటో మనకు తెలుసు కాని తండ్రి......? తల్లి చెబితేనే తెలుస్తుంది..
తల్లికి తన సంతానం పేగులో పేగు, రక్తంలో రక్తం అటువంటి తల్లి ప్రతి వ్యక్తికీ పూజనీయురాలు, వందనీయురాలు అందుకే “నూరుగురు సూర్యుల కంటే ఒక ఆచార్యుడు గొప్ప, నూరుగురు ఆచార్యులకంటే తండ్రి గొప్ప, నూరుగు తండ్రుల కంటే తల్లి గొప్ప” ఈ విషయం సాక్షాత్తు మనుస్మృతిలో చెప్పబడినది. తల్లి , తండ్రి , గురువు ఈ ముగ్గురూ జంగమ దేవతలు అంటే మన కళ్ల ముందు నడిచే దేవుళ్లు అని అర్దం.
“60 యేండ్లు దాటిన వృద్ధుడైనా తల్లి బ్రతికి ఉన్న వాడయితే బాలుడే , 5 యేండ్ల బాలుడైనా తల్లి లేకపోతే వృద్దుడే”ఇది స్కాంద పురాణంలో ప్రస్పుటంగా చెప్పబడినది..
నాకీ జన్మను ప్రసాదించిన నా తల్లికి అంకితమిస్తూ............శ్రీ

5 comments:

పరిమళం said...

తల్లి గొప్పదనాన్ని ఇంతకన్న బాగా ఎవరు చెప్పగలరు ? శ్రీ గారు ....అమ్మకు ఈ పండుగ శుభాకాంక్షలు నానుండి కూడా ...

sree said...

అమ్మకు ఈ పండుగ శుభాకాంక్షలు నానుండి కూడా ... చాలా చాలా సంతోషం పరిమళం గారు ధన్యవాదాలండి

mahigrafix said...

ఓపిక, సహనం ఒక్క అమ్మకే సొంతం. భాదలను, బాధ్యతలనూ భరిస్తూ చిరునవ్వు చిందించే అమ్మ గురించి చాలా బాగా చెప్పారు. good post. keep it up.

narayana said...

MERU CHESINA PRAYATNAM CHALABHAGUNDI. VITITO PATU BHASHA-SAMSKRUTI ANE AMSAM MEDA VISHAYALANU ANDIMCHAGALARU.
BVLAKSHMINARAYANA.M.A(SANSKRIT)BED.
NARAYANAVEKAT@GMAIL.COM

It's 4 U. said...

MAKU MERU RASE VISHAYALU CHALA BAGUNNAI.
MEELO SRUJANATMAKATAKU PARISRAMAKU VANDANAMULU... KONNI VISHAYALA POEMS,SLOKASNU KUDA MENTION CHESTE INKAA PILLALAKU KANTHASTAM CHEYADANIKI VEELUGA UNTUNDI......EMANTARU......................ITLU
NEE GATTAR

Post a Comment

కూడలి