Loading...
.

దురాశ , ఆశబోతు....

" అదిగో కుందేలు, పట్టుకో , పట్టుకో..." అనటమే ఆలస్యము వేటకుక్క దౌడందుకుంది. మెరుపు వేగంతో దూసుకుపోతోంది. కాళ్లకిందున్న రాళ్లను, ముళ్లనూ లెక్క చేయటం లేదు. పొదల్లో దూరుతోంది,పిల్ల కాలువల మీంచి గెంతుతోంది,కొండరాళ్ల మీదికెక్కి అమాంతంగా గుంతల్లోకి దూకుతోంది....కుందేలును వెంటాడుతూనే ఉంది... వెంటాడి,వేటాడి చిట్టచివరకు కుందేలును పట్టుకుంది.పట్టుకుని విజయగర్వంతో వెనుదిరిగింది.ప్రపంచమంతా తనకి జేజేలు పలుకుతూన్నట్టు తోకాడిస్తూ ఉరుకులు పరుగుల మీద వేటగాడి దగ్గరికి వచ్చింది.
వేటగాడు చేయిచాచి వేటకుక్క నోట్లో ఉన్న కుందేలు చెవులు వొడిసి పట్టుకొని " వదిలేయి చల్! హుట్ హుట్ " . కుందేలును వదిలేసిన వేటకుక్క తోకముడిచింది. కుందేలును బుట్టలో వేసుకున్న వేటగాడు కులాసాగా వెళ్లిపోయాడు వేటకుక్క బానిసలా ఈసురోమంటూ వెనుక వెళ్లంది.
ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక తాత తన మనవడితో ఇలా అన్నాడు..? ఆ వేటగాడెవరో తెలుసా..? అని తెలీదు అన్నట్టు తలవూపాడు మనవడు. తాత మరలా చెప్పటం మెదలు పేట్టాడు వేటగాడు పేరు దురాశ, వేటకుక్క పేరు ఆశబోతు. దురాశకు లొంగి ఆశబోతు అడ్డమైన పనులూ చేస్తుంది.అందరినీ మోసం చేస్తుంది డబ్బు కూడబెడుతుంది. కాని చిట్టచివరికి ఏమవుతుంది..? హటాత్తుగా మృత్యువు తలుపు తడుతుంది. "పట్టుకో, పట్టుకో" మని దురాశ తరిమితే నానా తంటాలు పడ్డవాడు, మృత్యువొచ్చి "వదిలేయ్, పో" అనగానే వొట్టి చేతుల్తో మొలమీద నూలుపోగు కూడా లేకుండా మట్టిలో కలిసిపోతాడు. ఆశబోతుకు బతుకు లేదురా నాన్నా, తెలుసుకో..తాత చెప్పుకుండూ పోతున్నాడు మనవడు తాత వంక కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు మీరు ఈ కధ చదివినట్టు..

2 comments:

మరువం ఉష said...

బాగుంది కథ, ఎన్ని రకాలుగా ఎన్ని తరాలుగా విన్నా ఇదే నీతి "దురాశ ధుఖఃమునకు చేటు" అని, చివరి మిగిలేది ఏమీ లేదని. Tolstoy's "Stories and Legends" ఓ కథలో నీతి ఇదే - How much land does a man need? అన్న ప్రశ్నకి బదులన్నట్లు Six feet from his head to his heels was all he needed. అరిషడ్వర్గాలలో మొదటి దాన్నే జయించలేని మనిషి దుర్బలతే అత్యాశ.

sree said...

ఎందుకో ఈ కధను, మా తాత గారు మాకు బాగా చెప్పేవారు . అది గుర్తు వచ్చి నిన్న ఈ టపాను వ్రాసాను వారి గుర్తుగా . "అరిషడ్వర్గాలలో మొదటి దాన్నే జయించలేని మనిషి దుర్బలతే అత్యాశ" నిజమే కదండి . ప్రతినిత్యం మీ అమూల్యమైన స్పందనను కోరుకుంట్టూ ధన్యవాదాలతో ...శ్రీ

Post a Comment

కూడలి