Loading...
.

గోవుమాలక్ష్మికి కోటి దండాలు


భారతీయ సంస్కృతిలొ గోవు కి గొప్ప విశిష్ట స్తానం ఉంది ఈ పవిత్రమైన గోవుని మన పూర్వీకులు , పెద్దలు తరతరాలుగా పూజించటం ఆనవాయితీగా వస్తోంది.
కాని నేటి కాలంలొ మన గోవుమాలక్ష్మి కొంత అనాదరనకు గురిఅవుతోంది.
దేవధానువులకు యుద్దం జరుగుతున్న సమయంలో దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళం లోంచి "సురభి" అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు
హిమవత్పర్వతం మీద సంచరిస్తూ ఉండగా ఒక దూడ తల్లి దగ్గరకు వెళ్ళి పాలు తాగడం మొదలు పెట్టింది. అప్పుడా పాలనురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు
చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకుని మూడోకన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిలవర్ణం వచ్చింది.
దాంతో అవన్నీ భయపడి అక్కడినుంచి పారిపోయాయి.
అప్పుడు బ్రహ్మ వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్ధించి ప్రసన్నుణ్ణి చేశాడు.ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటినుంచీ ధుర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభచిహ్నం ఉంటుంది.
శివుడు ప్రసన్నుడు కావడంతో ఆవులన్నీ మళ్ళీ ఆ పర్వతం మీదకు వచ్చాయి.వాటిని చూచి అవి సర్వత్రా సంచరించగలవిగానూ, మిగిలిన గోవులకంటే ఆ కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగాను వరమిచ్చాడు శివుడు.
ఈ నాటికీ గోవుల్ని లక్ష్మీస్వరూపాలుగా ఆరాధించటం,గోపంచకాన్ని పవిత్రమయిదిగా భావించటం జరుగుతోంది. భోజనం చేసే ముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యం..

0 comments:

Post a Comment

కూడలి