Loading...
.

అమ్మ మనసు

అమ్మ మనసు
నువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!
తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత దైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతగ్గలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు త్రుప్తిగా వుంది నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నా క్కొంచెం బాధగా వుంది అందరూ నేపోయానని ఏడుస్తుంటే
నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని....!

"అమ్మ"కవితా సంకలనం నుండి సేకరించటం జరిగింది
'అమ్మ' మనసు గొప్పదనాన్ని ప్రేమను మనకు తెలియచేసిన శ్రీలత గారికి మా నమస్కారములు

21 comments:

Anonymous said...

chaala baaga chepparu amma manasu gurinchi..

పరిమళం said...

శ్రీ గారూ ! మొదటిసారి చూస్తున్నా మీ బ్లాగ్ .మన సంస్కృతీ ,సాంప్ర దాయాల పట్ల మీకున్న గౌరవం తెలుస్తోంది .అభినందనలు .

నేస్తం said...

చాలా బాగారాసారు

పరిమళం said...

Nice pictures!

Anonymous said...

Amazing pictures, go a head

Ganesh said...

amma manasu gurinchi meeru bhaaga chepparu.
kaani naa kathalo , mee kavithalo climax naaku nachchleadu.

Anonymous said...

chalaa bagundi

Anonymous said...

eeeeeeeeeee kavithachala bagundi kani storylaaga rasaru.........dk

శ్రీ said...

D.K గారికి నమస్కారం ..
ఇక్కడ స్దల ప్రభావం వలన ఆ విదంగా రాయవలసి వచ్చింది . ధన్యవాదాలు

Anonymous said...

sainna namashkaram... amma manasu gurinchi hrudayaniki hathkunela chala baga chepparu..

Anonymous said...

sainna ku..namaskaram naperu vinod amma manasu gurinchi..na hrudayamnu kadalinchinavu... very thanks chalabagundi..

yochana said...

chala nachindi.edupochhindi.e ammayyina antena?

మరువం ఉష said...

శ్రీ, అమ్మ అన్నది ఎన్ని చెప్పిన చాలని అమరత్వం. అమ్మతనం అనుభవించి, అమ్మనయ్యాకా ఇంకా ఆస్వాదించినదాన్ని. అసలు అమ్మగా మారాక నన్ను నేను మరిచి, నా పేరే "xxx's mom" అనేంతగా నా అస్థిత్వం మార్చేసుకున్నదాన్ని. నిజానికి సన్నిహితులు నన్ను 24X7 mom అని ఆటపట్టిస్తారు. అందుకే నేనూ ఒక కవిత అమ్మ పరంగా మరొకటి అమ్మపైన వ్రాసుకున్నాను.

మీరు నా బ్ల్లగులో వ్యాఖ్య పెట్టటం మొదటిసారి కనుక బహుశా చదివివుండరేమోనని ఆ వివరాలు ఇస్తున్నాను. నా కవితల ప్రచారానికి మాత్రం కాదు.

దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html

అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html

హరే కృష్ణ said...

mee peru sai or sree
nijamanina kanna prema ni baaga chepparu

Rajasekharuni Vijay Sharma said...

మీ బ్లొగ్ చాలా బాగుంది... సంస్కృతీ సాంప్రదాయాలపట్ల మీ అభిమానం అభినందనీయం :)

Rajasekharuni Vijay Sharma said...

వీలైతె ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్య గలరా..

సుభద్ర said...

sri gaaru,chaalaa baagmdi.
ide modati saari mee blog chudatam very very god.
keep blogging.

మాలా కుమార్ said...

sri garu ,
chaalaa baagundi ,mee post . meeru pettina pictures kuudaa baagunnaayi

మాలా కుమార్ said...

మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

జయ said...

అమ్మతనం లోని తియ్యతనం ఇది. అన్నిటికన్నా తియ్యనైనది తల్లి ప్రేమ. తానికి రుజువు, తాను చనిపోయిన తరువాత కూడా, కుమారుని చేయి కాలుతుందేమొ అని తల్లి పడ్డ వేదనే. చాలా బాగుంది.

సుభద్ర said...

mee blog ede chudatam.. very very good ..
anni vaipulaa nunchi baagumdi.

Post a Comment

కూడలి