Loading...
.

మన కోసం మన అందరి కొసం....

భారతీయ సంస్కృతిలో కథ ఒక భాగం..
అమ్మ చేతి గోరుముధ్దలు ఎంత రుచో అమ్మ నోటి కథలు అంతే రుచి
వెన్నెల రాత్రుల్లో చుక్కల పందిరి క్రింద,నులక మంచంపై అమ్మమ్మ పక్కన కూర్చొని....పేదరాసి పెద్దమ్మ కధలు,చిట్టెలుక చమక్కులు,నక్క జిత్తులు,కుందేలు ఎత్తులు,కోమటి లోభితనం,కొరివి దెయ్యాల కబుర్లు,రాజుల జైత్రయాత్రలు,వీరుల త్యాగాలు,వింటూ ఊ... కొట్టని తెలుగు వాడు ఉండరేమో.
చల్లని చంద్రునిలా,సన్నని గాలిలా,జోలపాట పాటపాడుతూ నీతిని,నిజాయితీని,ఆదర్శాన్ని,అనుకువను,అలవోకగా అమ్మ చెప్పిన కధలు-కబుర్లూ మన మస్తిష్కంలో నిక్షిప్తమై మన వ్యక్తిత్వానికి ఒక రక్షణ కవచంలా మనల్నితీర్చిదిద్దుతున్నాయి.
అమ్మ చెప్పినా,అమ్మమ్మ చెప్పినా,తాతయ్య చెప్పినా, వారి ప్రేమ లాగానే ఆ కధలూ-కబుర్లూ మనల్ని సన్మార్గంలో నడుపుచున్నాయి. మన అమ్మమ్మలానే మన కధలు కూడ మనల్ని విడిచి వెళ్లకూడదని,మన సాంప్రదాయం,మన తెలుగు తనం అలనాటి తీపి గుర్తులు నిర్వీర్యం కాకూడదని,సదుద్దేశంతో మా అమ్మ కథలు-కబుర్లు ద్వార మరిచిపోయిన వారికి గుర్తు చేస్తూ, మన తరువాత తరాలకు అ కధలు అందించాలని ఆకాంక్షతో మీ ముందు ఉంచుతున్నాము..
మీ..
శ్రీ

3 comments:

narayana said...

manakosam mana andarikosam tapic chala bagundi.meru sekarinche photos kuda chala bagunnai

sree said...

ఎంతగానో ప్రియతముగా స్పందించే నా ప్రియ మిత్రులు నారాయణ గారికి , మరియూ శివరామక్రిష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు

జయ said...

అమ్మ కథలూ, కబురులూ చాలా బాగున్నాయి. కలకాలం నిలిచిపోయె గొప్పతనం అమ్మ కబురులకే. ఎవరెంత పెద్దవాళ్ళైనా చిన్నప్పటి అమ్మ కబురులు మాత్రం మరచిపోరు. అంతటి విలువ ఉంది మీ కబురులకి కూడా. చాలా బాగుంది.

Post a Comment

కూడలి