సమస్త చరాచరప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఓ సారి మానవుణ్ణి తన వద్దకు పిలిచి “నీకేమి కావాలి”? అని అడిగాడు .
మానవుడు ఇలా బదులిచ్చాడు ‘నేను బాగాపైకి రావాలి, సుఖశాంతులతొ తులతూగాలి. లోకులంతా నన్ను పొగడాలి’.
బ్రహ్మదేవుడు మానవుని ముందు రెండు సంచులు వుంచాడు. ఇలా అన్నాడు –“ ఈ రెండు సంచుల్ని తీసుకో, మొదటి సంచిలో నీ పొరుగువాని తప్పులున్నాయి.
రెండవ సంచిలో నీ తప్పులున్నాయి .మొదటి సంచిని నీ వీపు మీద వేసుకో కానీ దాన్ని ఎప్పుడూ విప్పకుండా వుండాలి మరియూ నీవు చూడకూడదు ఇతరులకు కూడా చూపించకూడదు .
రెండోవ సంచిని నీ ఎదుట వేలాడ తీసుకొని వుంచు. దాన్ని పదే పదే విప్పి చూస్తూ వుండు.”
మానవుడు రెండు సంచులను తీసుకున్నాడు. కాని అతను దుర్బుద్దితో ఓ పొరపాటు చేశాడు. అది ఏమిటంటే తన తప్పులున్న
సంచిని వీపుమీద పెట్టుకొని దాని మూతిని ఎవరూ చూడకుండ గట్టిగా బిగించివుంచాడు.ఎదుటి మనిషి తప్పులున్న సంచిని ఎదురుగుండా వేలాడదీశుకున్నాడు ప్రతి సారి దాని మూత విప్పి చూస్తూ ఇతరులకు కూడా చూపిస్తూ వుండేవాడు ఇది నచ్చక బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తలకిందులయింది . ఆ మానవుడు చితికిపోసాగాడు అతను సుఖశాంతులు లభించకపోగా దుఃఖం ,అశాంతి ఎక్కువ కొనసాగాయి లోకులు అతన్ని దూషించసాగారు.
ప్రతి మనిషి తన తప్పులు దిద్దుకోవాలి. అప్పుడే అతను పైకి వస్తాడు అతనికి సుఖశాంతులు లభిస్తాయి . ప్రజలు అతన్ని మనసారా ప్రశంసిస్తారు నీవు ఇరుగుపొరుగు వారి తప్పులను వేలెత్తిచూపడం మానుకోక పోతే మన పరిస్తితి అదే అవుతుంది కదా...
నీతి..... తమతప్పులను దిద్దుకొనే వాళ్ళే ఉత్తములు.
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
-
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP
సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాల...
10 years ago


1 comments:
శ్రీ గారు,
చిన్నపుడెపుడో ఇలాంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా చదివే వాణ్ని...కానీ తర్వాత వీలు కుదర్లేదు...ఇపుడు మీ బ్లాగులోని ప్రతి కథనూ చదువుతున్నాను. మీ ప్రతీ కథ లో ఒక నీతి మిళితమై ఉంది. ఇలాగే కంటిన్యూ చేయండి. మీ కథల ద్వారా కాంతిని ప్రసరించండి. కీపిటప్...గో ఎహెడ్...
Post a Comment