
ఆకాశంలో చంద్రుడి తర్వాత ఎంతో తేజోవంతంగా కనిపించే చుక్క ఒకటి ఉన్నది. దానినే శుక్రచుక్క అనీ శుక్రుడనీ అంటూ ఉంటారు (venus (6) in Numerology) ఎవరైతే 6,15,24, తేదీలలో జన్మిస్తారో
వారి లగ్నాదిపతి శుక్రుడు అవుతాడు ఆ శుక్రగ్రహం యెక్క ఆధిపత్యం ఆ జాతకునికి వర్తిస్తుంది.వీరు లేత నీలం,లేత ఎరుపు రంగులను వాడటం శ్రేయస్కరం,ఉంగరంలో శుభ్రమైన పచ్చనిగాని , వజ్రాన్ని గాని వెండిలో ధరించ్చాలి,వీరికి శుక్ర వారం,మంగళ వారం ఉపయోగకరములు,6,9,15,18,24,27 తేదీలు శుబప్రదమైనవి.మరియూ వీరు ముఖ్యంగా వెండి లోహం ను ధరించటం ఉత్తమం
ఈ వెండి లోహం ఉపయోగం గురించి మీకు తెలిసే వుంటుంది వెండి శక్తి శరీరానికి మంచిది అందుకే ఈ శక్తి కొంతయినా చేరాలనే పిల్లలకు వెండి గొలుసు తొడుగుతారు. వెండి పళ్ళాలలో భోజనం చేయడం ఆడంబరం కోసం కాదు అన్నంతోపాటు కాస్త వెండికూడా కడుపులోకి చేరాలనే అలా చేస్తారు . ). చుక్కలన్నిట్లోకి చాలా పెద్దదిగా, ప్రకాశవంతంగా, కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది ఈ చుక్క.
అంతేకాకుండా సూర్యుడికి ఎప్పుడూ రెండు,మూడు రాసులలోపలనే(రాసులనగా 30 డిగ్రీలు అని అర్దం) 60 లేక 80 డిగ్రీలలోపలనే ఉంటాడు.
సూర్యుడి సమీపంగా ఉంటున్న కారణంగానే శుక్రుడు ఎల్లప్పుడూ ప్రొద్దుకూకిన తరవాత పశ్చిమదిక్కునగాని,లేదా సూర్యోదయానికి ముందు తూర్పుదిశనగాని కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఆకాశ మద్యలో అగుపించడు.
వేకువ జామున పొడిచేచుక్క కావటంవల్ల దీనిని వేగుచుక్క అని కూడా అంటారు.
రాత్రిపూట ప్రొద్దు తెలియడానికి ఈ చుక్క కొండగుర్తుగా కూడ ఉంటుంది. చుక్క పొడిచినప్పుడు లేచి పనులు ప్రారంభించామని చెపుతూ ఉంటారు పల్లెటూళ్ళలో మన రైతులు.అంటే అప్పటికి తెల్లవార వస్తున్నదని వారి ఉద్దేశ్యం.
శుక్రనక్షత్రం తూర్పుదిశగా ఉన్నరోజులలో ఆ చుక్కకు ఎదురుగా అంటే తూర్పుదాక్కుగా గర్బిణీ స్త్రీలు,బాలెంతరాండ్రు,కొత్తగా పెళ్ళి అయిన యువతులు ప్రయాణం చేయరాదని, అలా చేయడం హానికరమని జ్యోతిష్యశాస్త్రం చెపుతోంది.
అలాగే చుక్క ఎటువైపు వున్నదో ఆ వైపునకే కాక ఎడమచేతి దిక్కునకు కూడా ప్రయాణం చేయటం దోషం, అంటే తూర్పున చుక్క ఉన్నప్పుడు ఉత్తరదిశకు, పశ్చిమాన ఉన్నప్పుడు దక్షిణ దిశకుకూడా ప్రయాణం నిషిద్దం..
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
-
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP
సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాల...
10 years ago


0 comments:
Post a Comment