Loading...
.

నరకంలో శిక్షలు.....



మనిషి మృత్యువు తరువాత తను చేసిన కర్మల ఫలితాలను అనుభవించడానికి స్వర్గ,నరకాలకు చేరుతాడు.
స్వర్గ లోకంలో స్వర్గ ప్రాప్తి పొంది పునర్జన్మ అనేది లేకుండా జీవిస్తాడు. అలానే నరకలోకంలో తను చేసిన పాపకర్మల ఫలితంగా కొన్ని భయంకరమైన శిక్షలను అనుభవిస్తాడు...
శ్రీ మద్భాగవతంలో మనిషి అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే విదానం వాటి సంక్షిప్త వివరణ ఇవ్వపడింది వాటిని మన అందరితొ పంచుకోవాలని ........ 1. తామిస్ర నరకం . పరుల యోక్క ధనాన్ని అపహరించ్చిన , పరస్త్రీలతో వ్యభిచరించినా ఈ శిక్ష ను పొందుతారు, ఇక్కడ అంధకారమైన(చీకటి) బంధురమున(గదిలొ) పడవేసి కాల్చిన ఇనుప కఱ్ఱలచే బాదుదురు.
2. అంధతామిస్ర నరకం... స్త్రీలను మోసగించి ధనమును తీసుకున్న వారు, తన కంటే పెద్దవారిని గౌరవించని వారు ఈ శిక్షను పొందుతారు ఇక్కడ చిమ్మ చీకటి గదిలో పాముల మద్య నరికిన చెట్ల వలె పడవేయుదురు.
3. రౌరవము... మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపిన వారికి ఈ శిక్ష అమలు చేయుదురు ఇక్కడ రురువులు (పాముల కన్న ఘోరమైనవి అతి భయంకరమైనవి)చే హింసించును.
4. మహారౌరవం.. మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపి తన శరీరాన్ని పోషించుకునేవారు , మూగ జీవులను భందించే వారును ఈ నరకంలోకి వస్తారు ఇక్కడ పచ్చి మాంసము తిను రురువులచే హింసించును.
5. కుంభీపాకము.. సజీవంగా వున్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఇక్కడు కు చేరుతాడు ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేయుదురు ..
6. కాలసూత్ర నరకం... తల్లిదండ్రులను, సద్భ్రాహ్మణులను,వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకాన్ని చూస్తారు ఇక్కడ రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు మాడ్చి వేయచుండును..
7. అసిపత్ర వనము.. తల్లిదండ్రులను , వేదములను, గురువులను, ధిక్కరించిన వారు ఇక్కడికి వస్తారు ఇక్కడ కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ, సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుచేయును..
8. సూకర ముఖము.... దండించ దగని వారిని దండిచిన రాజులకు మరియూ న్యాయమూర్తులనూ చెరకు గడలవలే గానుగలలో పెట్టి తిప్పుదురు..
9. అంధకూపము.... నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని పాములు,నల్లులు,దోమలు,చీమలు చే హింసించును.
10. క్రిమి భోజనము.... అతిధులకు అభ్యాగతులకు సరియైన అన్నం పెట్టక తన పొట్ట నింపుకొను వాడు క్రిములతో నిండిన సలసలగాకు లక్షయోజనముల కుండలో పడవేయబడును.
ఇలా మెత్తం 28 రకాల శిక్షలు వున్నాయి వీటిలో 10 మాత్రమే రాయగలిగాను మిగతావి అతి త్వరలో మీ ముందు వుంచ్చగలను ....శ్రీ

2 comments:

krishna rao jallipalli said...

నేటి కాలాని ఈ శిక్షలు సరిగ్గా సరిపోతాయి. మిగతా శిక్షలు రాసిన తరువాత, స్వర్గాన్ని గురించి కూడా రాయండి.

sree said...

krishna rao గారు నమస్కారం
మీరు కోరిన విదంగా మిగతా శిక్షలు కూడా సేకరించి పెట్టడం జరిగింది చూడగలరు అని మనవి

Post a Comment

కూడలి