Loading...
.

గుత్తొంకాయ్ కూరోయ్ బావా !..



గుత్తొంకాయ్ కూరోయ్ బావా !
కోరివండినానోయ్ బావా!
కూరలోపలా నా వలపంతా!
కూరిపెట్టినానోయ్ బావా కోరికతో తినవోయ్ బావా !!

తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగ వండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి!
పాలుబోసినానోయ్ బావా బాగని మొచ్చాలోయ్ బావా!!

కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీలతో !
నా కాంక్ష వేపినానోయ్ బావా కనికరించి తినవోయ్ బావా!!

వెన్నెల యిదుగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వన్నెలలో నా కన్నె వలపనే!
వెన్నగలిపినానోయ్ బావా వేగముగా రావోయ్ బావా!!

పువ్వుల సెజ్జిదిగో మల్లే!
పువ్వులు బరిచిందోయ్ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా!
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ బావా పవళింతాం బావా!!

చిన్నపుడు ఎప్పుడో విన్న జానపద గీతాలు నిన్న మన "తెలుగు వారి జానపదం" అన్నపుస్తకంలో చదివాను ఆ సంతోషం చెప్పలేనిది అది కేవలం మన తెలుగు వారికి మత్రమే దొరకకలిగిన సంతోషం ఆ సంతోషాన్ని మన అందరితో పంచుకోవాలని చిన్ని ఆశతో ..........శ్రీ

3 comments:

Unknown said...

good

Unknown said...

Hai sree 2012 dec12 visvam gurinchi telugu site kavali @kumar@

narayana said...

ME ASAYALU BHAVAKLU BAGUNNAI MERURASINA EJANAPADAM KOTTAGAVUNDI BAGUNDI. MEKU MA DANYAVADAMULU,.

Post a Comment

కూడలి