Loading...
.

అక్షౌహిణి అంటే...........?


మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం ఉంది అని అన్నారు కదా ! అసలు అక్షౌహిణి అంటే ఏంటి..? అక్షౌహిణి అంటే ఎంత ..? వీటి గురించి కొన్ని నిఘంటువులు మరి కొన్ని పుస్తకాలు తెలియచేస్తున్నాయి మరి ఒక్కసారి తొంగిచూద్దామా..?
ఒక రథము, ఒక ఏనుగు , మూడు గుర్రాలు , అయిదుగురు కాల్బంబులు(సైనికులు) కలిసిన సైన్యానికి “పత్తి” అని అంటారు, దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని “సేనాముఖము” అంటారు. అంటే మూడు రథాలు, మూడు ఏనుగులు , తొమ్మిది గుర్రాలు , పదిహేను మంది కాల్బలము ఇందులో వుంటారు .
సేనాముఖానికి మూడు రెట్లను “గుల్మము” అంటారు ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు,45 మంది కాలిబంట్లు(సైనికులు) వుంటారు , గుల్మానికి మూడు రెట్లు “గణము” . ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు , 135 మంది కాలిబంట్లుంటారు . గణానికి మూడు రెట్లు “వాహని” .ఇందులో 81 రథాలు , 81 ఏనుగులు , 243 గుర్రాలు , 405 మంది కాలిబంట్లు వుంటారు .
వాహినికి మూడు రెట్లు “పృతన” ఇందులో 243 రథాలు , 243 ఏనుగులు , 729 గుర్రాలు ,1215 మంది కాలిబంట్లుంటారు .పృతనకు మూడు రెట్లు “చమువు” ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు , 2187 గుర్రాలు , 3645 మంది కాలిబంట్లుంటారు.
చముకు మూడు రెట్లు “అనీకిని” ఇందులో 2187 రథాలు , 2187 ఏనుగులు , 6561 గుర్రాలు , 10935 మంది కాలిబంట్లు వున్నారు . అనీకినికి పది రెట్లయితే “అక్షౌహిణి” అవుతుంది. అంటే అక్షౌహిణిలో 21,870 రథాలు , 21,870 ఏనుగులు , 65,610 గుర్రాలు , 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి, అంటే 3,93,660 రథాలు , 3,93,660 ఏనుగులు , 11,80,980 గుర్రాలు , 19,68,300 కాల్బలము వున్నారు అన్నమాట అయితే ఇంకో విషయం ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారధి కూడా వుంటాడు కాబట్టి సారదులను కూడా లెక్కలోకి తీసుకుంటే అప్పుడు రథబలం 7,87,320 గా వుంటుంది, అలాగే గజబలంలో యుద్ధ వీరునితో పాటు ఒక మావటి వాడు వుంటాడు కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నారు . అయితే ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు మాత్రమే . 8 అక్షౌహిణులు ఒక ఏకము 8 ఏకములు 1 కోటి ( ఈ కోటి వేరు) 8 కోట్లు ఒక శంఖము , 8 శంఖములు ఒక కుముదము, 8 కుముదములు ఒక పద్మము, 8 పద్మములు ఒక నాడి , 8 నాడులు ఒక సముద్రము , 8 సముద్రాలు ఒక వెల్లువ . అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు . ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద వున్నట్లుగా కంబ రామాయణం చెబుతుంది . అంటే సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట వీరిలో 67 కోట్ల మంది సైన్యాధిపతులు . వీరికి నీలుడు అధిపతి , అక్షౌహిణికి ఇంత గొప్ప కధ ఉంది...

1 comments:

Kiran said...

Good Post! Thanks

Post a Comment

కూడలి