Loading...
.

రాజకుమారులు - ఏడు చేపలు

అనగనగా ఒక రాజ్యంలొ ఒక రాజుగారికి ఏడుగురు కొడుగులట ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజున చెరువు దగ్గరికి వెళ్ళి ఏడు చేపలని పట్టారట .ఆ ఏడుగురు రాజకుమారులు తెచ్చిన చేపలిని ఎండలో ఎండ పెట్టారు ఆరు చేపలు బాగా ఎండాయి కాని ఒక చేప మాత్రం ఎండనే లేదట అయితే ఆ రాజకుమారులు ఎండని చేప దెగ్గరికి వెళ్ళి “చేపా!చేపా ఎందుకు ఎండలేదు?” అని అడిగారు “నేనెలాగ ఎండుతాను !ఎండలేదుగా అని అన్నది” మరి మిగతా ఆరు చేపలు ఎండాయిగా అన్నారు వాళ్ళు “నేనేం చెయ్యను ఆ గడ్డిదుబ్బు నాకే అడ్డం వచ్చింది” అంది “గడ్డి దుబ్బూ!గడ్డి దుబ్బూ ఎందుకు అడ్డం వచ్చావు ?” అని అడిగారు రాజకుమారులు . “నేనేం చెయ్యనయ్యలారా! నన్ను ఆవు మేయలేదు కదా!” అంది , “ఆవూ! ఆవూ!! ఆ గడ్డి దుబ్బును ఎందుకు మేయలేదు”? అని అడిగారు . “ నేనేం చెయ్యను బాబుల్లారా! ఆ గొడ్లకాపరి నన్ను మేపలేదుగా” అంది ఆవు, “ఏయ్ గొడ్లను కాసేవాడా ఆవును ఎందుకు మేపలేదురా ?” అని అడిగారు “ అయ్యా ! రాకుమారులారా నేనేం చెయ్యను, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు?” అని చెప్పాడు గొడ్లకాపరి .అప్పుడు యువరాజులు అవ్వదగ్గరికి వెళ్ళి “అవ్వా!అవ్వా!! గొడ్లకాపరికి బువ్వ ఎందుకు పెట్టలేదు ?” అన్నారు “ నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు , “గొడ్లకాపరికి బువ్వ ఎట్లా పెట్టగలనూ?” అని సాగతీసింది . “బుజ్జీ! బుజ్జీ!! ఎందుకు ఏడ్చావమ్మా అని జాలిగా అడిగారు “ నేనేం చెయ్యను నన్ను చీమ కుట్టిందిగా అని చూపించాడు బుజ్జిగాడు” “చీమా ,చీమా బుజ్జిగాన్ని ఎందుకు కుట్టావు అని అడిగారు ?” “ నేనేం చెయ్యను నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టకుండా ఊరు కుంటానా అని తుర్రున పుట్టలోకి దూరింది. . . చిన్నపుడు ఎప్పడో అమ్మ చెప్పిన తమాషా కధ బలేకుంది కదూ...........

0 comments:

Post a Comment

కూడలి