Loading...
.

వివేకానందుడు


ముద్దులు మూటగట్టే చిన్నబాలుడు.
ఇంటిముందు ఆడుకుంటున్నాడు
తల్లి అతడికి స్నానం చేయించి క్రొత్త బట్టలు కట్టింది అతని పేరు నరేంద్రుడు, ఇంతలో ఒక బైరాగి భిక్షం అడుగుతూ ఆ బాలుడు ఉన్న ఇంటిముందు నిలిచాడు "నారాయణ నారాయణ" అని పాడుతూ భవతీ భిక్షాం దేహి అన్నాడు. ఆడుకొంటున్న బాలుడు బైరాగిని చూచి ఆనందంతో గంతులు వేశాడు తన దగ్గర ఉన్న పట్టురుమాలుని బైరాగికి ఇచ్చివేశాడు బైరాగి ఆ బాలుడిని దీవించి వెళ్ళిపోయాడు
ఇంతలో తల్లి వచ్చి ఆనందతాండవం లొ ఉన్న పిల్లవాన్ని చూచి రుమాలు గురించి అడిగింది ఆ బాలనరేంద్రుడు బెదరకుండా బైరాగికి ఇచ్చా నని చెప్పాడు
తల్లి కోపగించుకుంది
ఇట్లాగే యాచకులు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వటం అలవాటు అయింది మన నరేంద్రుడికి తల్లి ఆ బాధ పడలేక యాచకులు వచ్చే సమయానికి ఆ బాలుడిని గదిలో ఉంచి బయట గడియపెట్టేది అయినా ఆ బాలుడు కిటికీలో నుండి ఏదో ఒక వస్తువు యాచకులకు ఇస్తూవుండేవాడు.............................?
"నా దేశంలో ఒక్క కుక్క అయినా పస్తుపడి ఉంటే దానికి ఆహారమిచ్చి రక్షించమే నా పరమధర్మము ఇదే నా మతము" అని చాటి చెప్పిన మహనీయుడు, చిన్న తనంలోనే అంతటి దానగుణాన్ని ప్రదర్శించిన మహనుబావుడు అయిన నరేంద్రుడు మరి ఎవరో కాదు మహాభక్తుడు,రామకృష్ణ పరమహంసకు ముఖ్యశిష్యుడు , భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన గొప్ప దేశ భక్తుడు మన వివేకానందుడు అయిన వివేకానందస్వామి

2 comments:

దువ్వూరి వేణుగోపాల్ said...

బాగున్నాయి

శ్రీ said...

దువ్వూరి వేణుగోపాల్ గారికి, మరియూ audisesha reddy గారికి నా హృదయపూర్వక నమాస్కారములు మీ లాంటి వారి సూచనలూ సలహాలను ఆశిస్తూ.....శ్రీ

Post a Comment

కూడలి